మాతృమూర్తి నుండి అందిపుచ్చుకునే భాష...
ఇతర భాషలు విషయపరిజ్ఞానము అన్నీ కూడా పాఠశాల నుండి సమాజం నుండి మనం నేర్చుకోగలం. కానీ ఒక్క మాతృభాష మాత్రం తల్లి గర్భం నుండే మనము నేర్చుకోవడం జరుగుతుంది కనుకనే తల్లి భాష,మన మాతృభాషకు అంత ప్రాధాన్యత ఉంది. మాతృభాషను విస్మరించిన మనిషికి, నాగరిక మానవునికి సమాజంలో స్థానం లేదు, గుర్తింపు ఉండదు. మాతృభాష మంచిగా నేర్చిన పరభాషలను కూడా పాయసం లాగా ఆరగించవచ్చు మహాభారతంలో చెప్పినట్లు అర్జునుని కుమారుడైన అభిమన్యుడు తల్లి గర్భం నుండే భాషను నేర్చుకున్నట్లు యుద్ధ వ్యూహాలను విన్నట్లు మనకు తెలుస్తోంది.
ప్రస్తుత పాలకులు అవన్నీ ప్రక్కన పెట్టి కేవలం ఆంగ్ల మాధ్యమంలో చదివితే ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకడం తెలుగు ప్రజలను మోసం చేయడమే అవుతుంది. పిల్లల ప్రతిభ మాతృభాషను నేర్చుకునే అంశంపైనే ఆధారపడి అభివృద్ధి చెందుతుంది. ప్రాథమిక స్థాయిలో పిల్లలను మాతృభాషలో మాట్లాడించడం తద్వారా ఇతర విషయాలను నేర్పించడం ద్వారా చక్కని అభ్యసనాన్ని అందుకోగలుగుతారు. వీటిని మరిచిపోయి తెలుగు అకాడమీని రద్దుచేసి తెలుగు మాధ్యమాలను రద్దుచేసి నిర్బంధ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా పాలకులు సాధించగలిగినది ఏమీ లేదు. పైపెచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులు జీవితాలు అంధకారంలో మగ్గిపోవాల్సిందే
చిన్ననాటి నుండి మనం నేర్చుకున్న తెలుగు భాష వేమన శతకం, సుమతి శతకం లాంటి గొప్ప పదకోశాలను అందించే భాష ప్రయోగాలు, అలాగే నీతి కథలు, ధర్మము, న్యాయము గురించి చెప్పే వారు ప్రస్తుత సమాజంలో దూరమయ్యారు. కనుక వీటన్నిటిని ఈ తరం పిల్లలకు అందించాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంది. కావున తప్పకుండా మనం ఏ ప్రదేశానికి వెళ్లినా... తెలుగు భాష పైన ఉన్న మక్కువను అక్కడున్న పిల్లలచే మెప్పించేటట్లుగా భాష పట్ల మమకారం పెంపొందించే విధంగా ఉండాలి అలాగే పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలి. ఇచ్చిన పుస్తకాల నుండి ఏదో ఒక అంశాన్ని నేర్చుకోమని,అప్పజెప్పమని సూచించాలి అలా చెప్పిన వారికి బహుమతులు అందజేయాలి. ఈ చిన్ని ప్రయత్నం అందరూ చేస్తే ముందుగా తల్లిదండ్రులు తమ కుటుంబంలో పిల్లలకు తెలుగు నేర్పించడం, తెలుగులో మాట్లాడడం, రాయడం, చదవడం ఇలాంటివి చేస్తే తెలుగు భాష మరింత మధురంగా తయారై మరింతకాలం మనగలుగుతుందని నా అభిప్రాయం
ఇట్లు
పత్తిపాటి రమేష్ నాయుడు
అభినవవేమన, పద్య కవి.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామలచెరువు తిరుపతి జిల్లా
చరవాణి: 9491776837.
పాకాల, చిత్తూర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఫిబ్రవరి 21, 2023
ఉప్పలగుప్తం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2023,
మదనపల్లి, అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
కాణిపాకం, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023 , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రఘుదేవపురం సీతానగరం మం. తూర్పుగోదావరి, ఆంధ్ర ప్రదేశ్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
బాపట్ల జిల్లా, మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల (LE), కూచిపూడి, ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2023
గానుగపాడు, తిరువూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2023
కేశవరం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ, లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2023
గట్టుతుమ్మెన్, బల్మూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
పెద్ద కొమెర గ్రామం, గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
ఇమ్మడి చెరువు, వెలిగండ్ల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
హుస్నాబాద్,సిద్దిపేట జిల్లా, తెలంగాణలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
నాగసముద్రల, కోహెడ మండలం, సిద్దిపేట, తెలంగాణలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
బందార్లపల్లి గ్రామం, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
దామలచెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
దామలచెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
గుండ్లగుట్టపల్లి, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
మల్లేశ్వరం పశ్చిమ గోదావరి ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023
పి వేమవరం, తూర్పు గోదావరి, ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, 21st ఫిబ్రవరి 2023

ఈ వెబ్ సైట్ లో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం, 21st ఫిబ్రవరి, తెలుగు అధ్యాపకుల సంఘం, తెలుగు రాష్ట్రాలు - ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కావలసిన అన్ని వనరులు ని పెట్టాము.
వనరులు డౌన్ లోడ్ (దింపుకోండి) చేసుకోండి
Banner - బ్యానర్ - 6 ft x 3 ft
అందరు పాల్గొని విజయవంతం చేస్తారు అని ఆశిస్తున్నాము
>>> వెంటనే చేరండి