తెలుగు అధ్యాపకుల సంఘం అద్వర్యంలో, తెలుగు రాష్ట్రంలో స్వతంత్ర సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య ఉద్యమం వివిధ రూపాల్లో జరిగింది.ఇందులో విప్లవ మార్గం ఒకటి.మన్యం వీరుడు ఆల్లూరి సీతారామరాజు వంటి బ్రిటిష్ వారికి ఎదిరించి ప్రాణ త్యాగం చేశారు.మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు.
అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు.
గంటందొర, మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన క్రిష్ణదేవీపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు. ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలా మంది రాజు అనుచరులను చంపేసింది.
బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని కాల్చిచంపారు.ఈ ఏడాది ఆయన 125వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇట్లు
యం.రాం ప్రదీప్
తిరువూరు
తెలుగు అధ్యాపకుల సంఘం గౌరవ సభ్యులు
తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ)

News and Print Media Coverage
పాండ్రంగి, విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
శ్రీకాకుళం జిల్లా, అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
పశ్చిమ గోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
ఉప్పలగుప్తం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
అమలాపురం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
చిత్తూరు జిల్లా, అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
గానుగపాడు, కృష్ణా జిల్లా , అల్లూరి సీతారామరాజు జయంతి, 04 జులై 2023
మీ స్కూలులో లేక కాలేజీలో జయంతి చేయాలనుకుంటున్నారా?
గవర్నమెంట్/ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, అధ్యాపకులు - ఈ జయంతి చేయాలని కోరుకుంటే, ఈ ఫోన్ నెంబర్ కి SMS/message పెట్టండి +91 9986795754 (శివ కిరణ్, Hon Advisory Member, Telugu Teachers Association).
ఈ వెబ్ సైట్ లో శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలుకి కావలసిన అన్ని వనరులు ని పెట్టాము. మొత్తం తెలుగు వారు అందరికి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు చేసిన సేవలు తెలియాలని ఆశిస్తున్నాము.
వనరులు డౌన్ లోడ్ (దింపుకోండి) చేసుకోండి
Banner - బ్యానర్ - 6 ft x 3 ft

High Resolution Photo
ప్రఘటన వాక్యాలు
అందరికి ఆహ్వానం
జులై 04th 2023 తేదీలో "తెలుగు అధ్యాపకుల సంఘం" ఆద్వర్యం లో "శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు" మా సంస్థ లో నిర్వహిస్తున్నాము.
1. జాతీయ వ్యాస రచన పోటీలు
2. శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి గురించి ఐదు నిమిషాల్లో (వీడియో పోటీలు)
3. తెలుగు భాషకు అయన చేసిన సేవలు - బొమ్మల రూపంలో.
మరి ఎన్నో రకాల కార్యక్రమాలు.
స్కూల్ పేరు
సంస్థ పేరు
జిల్లా
నిర్వహణ అధికారి
అందరు పాల్గొని విజయవంతం చేస్తారు అని ఆశిస్తున్నాము
Certificate - ధృవీకరణ పత్రం

Certificate - ధృవీకరణ పత్రం కావాలి అనుకునేవారు info@sevas.org.in కి ఇమెయిల్ పంపగలరు లేక +91 9986795754 (Siva Kiran RR, Hon Member) కాల్ చేయగలరు.
Email to info@sevas.org.in or call to +91 9986795754 (Siva Kiran RR, Hon Supporting Member, Telugu Teachers Association, Telugu States) for any kind of support or guidance.
Sponsorship:
Interested sponsors can email to info@sevas.org.in for sponsoring distrit wide events. The sponsoring organization names will be printed in the banner.
>>> వెంటనే చేరండి